గరుడ ప్రతినిధి
చౌడేపల్లి సెప్టెంబర్ 27
చౌడేపల్లి మండలం పుదీపట్ల గ్రామంలో వెలసిన స్వయంభు శ్రీ వైష్ణవి దేవి ఆలయంలో దసరా నవరాత్రులలో ఆరవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవి అలంకారంలో దర్శనమిచ్చారు. వైష్ణవి దేవి,అమ్మవారికి ఆలయ అర్చకురాలు శ్రావణి ఉదయమే పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అనంతరం సౌందర్యలహరి పారాయణం చేస్తూ అమ్మవారికి ఎంతో ఇష్టమైన తామరులతో అమ్మవారిని అలంకరించి శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.పుంగనూరు చౌడేపల్లి పుదీపట్ల చుట్టుపక్కల గ్రామ ప్రజలు అమ్మవారిని దర్శనం చేసుకున్నారు.ఈరోజు ఉభయదారులుగా పుంగనూరుకు చెందిన అడ్వై్కేట్ వెంకట్రామయ్య సెట్టి, శైలేందర్ కుమార్, ధర్మపత్ని భాగ్యలక్ష్మి, కదిరికి చెందిన లక్ష్మణ్ కుమార్, ధర్మపత్ని నందిని గా వ్యవహరించారు. ఆలయ ధర్మకర్త వినోద్ కుమార్ భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.



