సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి,అక్టోబర్19,(గరుడ న్యూస్):

రాష్ట్రవ్యాప్తంగా బీసీ బందులో భాగంగా ఎల్బీనగర్ చౌరస్తాలో ప్రముఖ న్యాయవిధులు జస్టిస్ ఈశ్వరయ్య, ఉన్నతఅధికారి చిరంజీవులు,ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ విశారదన్ మహరాజ్ మొదలైన వారితో కలిసి బీసీ బందులో పాల్గొని తర్వాత తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు,లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్,మునుగోడు నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ కంటెస్టెంట్ ఎంపీ అభ్యర్థి హైకోర్టు ప్రముఖ న్యాయవాది నర్రి స్వామి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా బీసీ జాక్ పిలుపు మేరకు ఎల్బీనగర్ లోని రహదారులను దిగ్బంధం చేసి రాస్తారోకో నిర్వహించడం సంతోషకరం అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా బంధువులు నిర్వహించిన ప్రతి ఒక్క బీసీ సోదరునికి అభినందన తెలియజేస్తా ఉన్నాం బీసీ బందు విజయవంతమైంది రాబోయేది బీసీ రాజ్యాధికారమే బీసీ రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా బీసీలంతా చైతన్యం కావాలని పోరాటాలు నిర్వహించాలని 42 శాతం రిజర్వేషన్ బీసీలకు న్యాయబద్ధమైనదే ప్రస్తుత జనాభా ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిం తెలియజేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో సామాజిక వేత్త న్యాయవాదుల సంఘం జాతీయ అధ్యక్షుడు పున్నం ధీరజ్ గౌడ్,సంతోష్ బాబు,మాచర్ల విష్ణు,అనేకమంది సామాజిక సంఘాల నాయకులు,ప్రజాసంఘాల నాయకులు,పాల్గొన్నారు.



