ఇండియాలోనే నెంబర్‌ వన్‌ ‘చికిరి చికిరి’ సాంగ్‌.. కొత్త రికార్డు క్రియేట్‌ చేసిన చరణ్‌! – Garuda Tv

Garuda Tv
1 Min Read


– వ్యూస్‌లో కొత్త రికార్డు

– చరణ్, జాన్వీ స్టెప్స్‌కి ఫ్యాన్స్ ఫిదా

– చరణ్ బర్త్ డే కానుకగా పెద్ది రిలీజ్

రామ్‌చరణ్‌, బుచ్చిబాబు సానా రూపొందించిన ‘పెద్ది’ వచ్చే ఏడాది మార్చి 27న చరణ్‌ బర్త్‌డే సందర్భంగా విడుదల ప్లాన్‌ చేశారు. ఈ చిత్రం ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మొదటి పాట ‘చికిరి.. చికిరి..’ని విడుదల చేశారు మేకర్స్‌. ఈ పాటకు బాలాజీ సాహిత్యం అందించగా మోహిత్ చౌహాన్ పాడారు. చరణ్‌, జాన్వీ కపూర్‌లపై చిత్రీకరించిన ఈ పాటకు జానీ మాస్టర్‌ నృత్యరీతులు సమకూర్చారు. డీసెంట్‌ స్టెప్స్‌తో సాగే ఈ పాట అందర్నీ ఆకట్టుకుంటోంది. తమిళ్‌లో ఈ పాటను ఎ.ఆర్.రెహమాన్‌ ఆలపించడం విశేషం.

ఇదిలా ఉంటే.. ‘చికిరి చికిరి’ సాంగ్ ఓ కొత్త రికార్డును క్రియేట్ చేసింది. పాట విడుదలైన 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో 46 మిలియన్ వ్యూస్‌ని కలిగి ఉంది. అలాగే ఈ పాటకు 13 గంటల్లో 32 మిలియన్ వ్యూస్‌ లభించాయి. గతంలో ఓ పాట 24 గంటల్లో 32 మిలియన్‌ సాధించి రికార్డు సృష్టించింది. దాన్ని క్రాస్ చేస్తూ ‘చికిరి చిరి’ సాంగ్‌ 46 మిలియన్‌ వ్యూస్‌ రాబట్టి ఇండియాలోనే నెంబర్‌ వన్‌ సాంగ్‌గా నిలిచింది. ఇప్పటికే ఈ పాటలోని స్టెప్స్‌పై చర్చ మొదలైంది. , జాన్వీ వేసిన స్టెప్పుల గురించి చరణ్ ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. అలాగే ఎ.ఆర్.రెహమాన్ చాలా కాలం తర్వాత తెలుగులో సినిమా చేయడం కూడా సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *