బాలకృష్ణ, ప్రభాస్ మధ్య పోటీ తప్పదా?.. వైరల్ అవుతున్న లేటెస్ట్ అప్‌డేట్! – Garuda Tv

Garuda Tv
2 Min Read


– సంక్రాంతి బరిలో ముగ్గురు టాలీవుడ్ హీరోలు

– మొదలు కానీ అఖండ2 ప్రమోషన్స్

– రాజాసాబ్ మళ్లీ పోస్ట్‌పోన్ అవుతుందా?

త కొంతకాలం స్టార్ హీరోల సినిమాలేవీ అనుకున్న టైంకి రిలీజ్ అవ్వడం లేదు. ఒక రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసిన తర్వాత ఆ డేట్‌కే సినిమా రిలీజ్ అవుతుందన్న గ్యారెంటీ లేదు. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు.. అనేక సార్లు సినిమా రిలీజ్ ని వాయిదా వేస్తున్నారు. దానికి అనేక కారణాలు ఉండవచ్చు. అయితే దాని వల్ల ఆ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి సన్నగిల్లే అవకాశం కూడా ఉంది అనేది ట్రేడ్ వర్గాల అభిప్రాయం. గతంలో వాయిదాల మీద వాయిదాలు పడ్డ సినిమాలు హిట్ అయిన సందర్భాలు చాలా తక్కువ. ప్రస్తుతం వాయిదా పడుతున్న సినిమాలన్నీ భారీ బడ్జెట్‌లో నిర్మించిన సినిమాలు కావడంతో ఈ చర్చకు ప్రాధాన్యత పెరిగింది.

ఇప్పుడు పాన్‌ ఇండియా సినిమాల రిలీజ్‌లు అయోమయంలో పడినట్టు కనిపిస్తున్నాయి. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘అఖండ2’ చిత్రం మొదట సెప్టెంబర్‌ 25న రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేశారు. కానీ, పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ ఇంకా పెండింగ్‌లో ఉన్నందున డిసెంబర్ 5న సినిమా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయింది. అయితే ఇప్పుడు గ్రాఫిక్ వర్క్ ఇంకా జరుగుతోందని. దీనితో రిలీజ్ డేట్ మీద కూడా సందేహాలు వస్తున్నాయి. ఎందుకంటే మరో 20 రోజులు మాత్రమే టైం ఉంది. కానీ, ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించి ఎలా ప్రమోషన్స్‌ స్టార్ట్ చేయలేదు. దీన్ని బట్టి ‘అఖండ2’ మరోసారి పోస్ట్‌ పోన్ అవుతుందన్న వార్తకు బలం చేకూరింది.

ఇక ప్రభాస్, మారుతి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘రాజాసాబ్’ చిత్రం పరిస్థితి కూడా అదే. మొదట ఈ డిసెంబర్ 5న విడుదల చేయబోతున్నట్టు మొదట ప్రకటించారు. ఆ తర్వాత జనవరి 9న సంక్రాంతి కానుకగా సినిమా రిలీజ్‌ చేస్తున్నట్టు ఒక ట్రైలర్‌ ద్వారా తెలిపారు. ఇప్పుడు ‘అఖండ2′ సంక్రాంతికి తీసుకురావాలనే ఆలోచనలో మేకర్స్’ ఉన్నట్టు సమాచారం. అదే జరిగితే ‘అఖండ2’, ‘రాజాసాబ్’ చిత్రాల మధ్య భారీ పోటీ నెలకొనే అవకాశం ఉంది.

మరో పక్క మెగాస్టార్‌ చిరంజీవి, అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘మన శంకరవరప్రసాద్‌గారు’ జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంటే సంక్రాంతికి మూడు భారీ సినిమాలు బరిలో ఉండబోతున్నాయన్నది తాజా సమాచారం. మరి వీటిలో ఏ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది, ఏది పోస్ట్‌పోన్ అవుతుంది అంటే ఇప్పటి వరకు క్లారిటీ లేదు. అయితే ‘రాజాసాబ్’ చిత్రానికి సంబంధించిన వర్క్‌ ఇంకా బ్యాలెన్స్‌ ఉందని, జనవరి 9న ఈ సినిమా విడుదలయ్యే అవకాశం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *