సంగారెడ్డి జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ మారుమూల ప్రాంతం నారాయణఖేడ్ లోని ఈ తక్షశిల పాఠశాలలో అట్టహాసంగా ప్రారంభము

Jaipal Reddy
2 Min Read

నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని ఈ తక్షిల పాఠశాలలో మంగళ వారం రోజు నారాయణఖేడ్ నియోజకవర్గ చరిత్రలోనే ఎప్పుడూ నిర్వహించనీ జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి గారి ప్రత్యేక చొరవతో జిల్లా విద్యాధికారుల సహాకారంతో ఖేడ్ లో జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ నిర్వహించగా ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై కార్యక్రమంలో పాల్గొన్న జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ శేట్కర్ ,నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి అడిషనల్ కలెక్టర్ చంద్ర శేఖర్ సబ్ కలెక్టర్ ఉమా హారతి,జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు

అనంతరం ఎంపి, ఎమ్మెల్యే,అదనపు కలెక్టర్,డిఈఓ మాట్లాడుతూ నారాయణఖేడ్ నియోజకవర్గం జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ నిర్వహించలని మా ప్రాంత విద్యార్ధులు రాష్ట్ర స్థాయిలో లో ర్యాంకులు సాధించారని ఈ సైన్స్ ఫెయిర్ ద్వారా విద్యార్థులు ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకోనీ ఇంకా ఎక్కువగా విద్యార్ధులు విద్యను అభ్యసిస్తారని దీనికి గాను మా నియోజకవర్గం లో జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ నిర్వహించడానికి సహకరించిన జిల్లా కలెక్టర్ గారికి జిల్లా విద్యా అధికారులకు మరియు ముఖ్యంగా మా ప్రాంత MEO లు ఉపాధ్యాయులకు మా ఖేడ్ నియోజకవర్గ ప్రజల తరఫున విద్యార్థుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు అని ఎమ్మెల్యే తెలిపారు. సాంకేతికతకు ప్రతిరూపంగా ఐఐటి మన జిల్లాలో ఉండడం గర్వకారణమని ఎంపీ గారు తెలిపారు తెలంగాణ విజన్ 2047 కు ఇప్పటినుంచి విద్యార్థులు సాంకేతికంగా అభివృద్ధిలో ముందుండాలని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు అలాగే జిల్లా విద్యాధికారి మాట్లాడుతూ మారుమూల ప్రాంతమైన నారాయణఖేడ్లో జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ జరగడం ఇక్కడ ప్రాంత ప్రజాప్రతినిధుల సహకారంతో మరియు ఈ తక్షశిల పాఠశాల యాజమాన్యం సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపడం జరిగింది

ఈ కార్యక్రమంలో వారితోపాటు ఖేడ్ మండలకు సంబంధించిన MEO లు మరియు ఉపాధ్యాలు, విద్యార్థులు,ముఖ్య నాయకులు,700 పైగా సైన్స్ ప్రదర్శనలు రిజిస్టేషన్లు చేసుకోవడం జరిగింది. పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది .

- Advertisement -
Ad image

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *