సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, సంస్థాన్ నారాయణపురం,డిసెంబర్07,(గరుడ న్యూస్):

యాదాద్రి భువనగిరి జిల్లా,సంస్ధాన్ నారాయణపురం గ్రామ చౌరస్తా లో అయ్యప్ప స్వాములు అందరూ కలిసి అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహిచారు.ఈ పూజా కార్యక్రమానికి కమ్యూనిస్ట్ పార్టీ,బలపరిచిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఉప్పల విజయలక్ష్మి – లింగస్వామి దంపతులు హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అయ్యప్ప స్వామి కరుణాకటాక్షాలు గ్రామ ప్రజలందరి మీద ఉండాలని,వారందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు,భక్తులు,తదితరులు,పాల్గొన్నారు.




