ఈ సారి సంక్రాంతి పందెం డైనోసార్ పై వెయ్యండి.. ఓజి గుర్తుందిగా – Garuda Tv

Garuda Tv
2 Min Read


-ఎస్ కె ఎన్ వ్యాఖ్యల్లో అంతర్యం ఏమిటి
-ఎవరి పేర్లు చెప్తాడు
-రాజా సాబ్ ఈవెంట్ లో అసలేం జరిగింది

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్(ప్రభాస్)రేపు బెనిఫిట్ షోస్ తో వరల్డ్ వైడ్ గా ‘ది రాజాసాబ్'(ది రాజాసాబ్)తో అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి జె విశ్వప్రసాద్ సుమారు 300 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన రాజా సాబ్ పై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. రోజు ప్రచార కార్యక్రమాల్లో భాగంగా చిత్ర యూనిట్ ఈ రాత్రి హైదరాబాద్ లోని అజీజ్ నగర్ లో ప్రీ రిలీజ్ పార్టీని నిర్వహించింది. ఈ వేడుకకి అభిమానులతో పాటు మీడియా ప్రతినిధులు హాజరుకావడం జరిగింది.

ఇది కూడా చదవండి: మన శంకరవరప్రసాద్ గారు, రాజా సాబ్.. ఏ ఫంక్షన్ దగ్గర ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు

ఈ సందర్భంగా రాజాసాబ్ కి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా ఉన్న ఎస్ కె ఎన్(Skn)మాట్లాడుతు విశ్వప్రసాద్ గారు తన ‘మిరాయ్'(Mirai)మూవీ మంచి రన్నింగ్ లో ఉన్న ఓజి కోసం కొన్ని థియేటర్స్ ని త్యాగం చేసారు. తెలుగు సినిమా పాన్ ఇండియా లెవల్లో ఎదగడానికి ప్రభాస్ గారు బాహుబలి ద్వారా ఐదేళ్లు కష్టపడ్డారు. అలాంటి ప్రభాస్ సినిమా వస్తుందంటే ఇండస్ట్రీ పెద్దలు థియేటర్స్ విషయంలో కో ఆపరేట్ చెయ్యాలి. అలా కో ఆపరేట్ చేసిన వాళ్ళ పేర్లు పండుగ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి చెప్తాను. ఆ ప్రెస్ మీట్ లో అందరి పేర్లు ఉండాలని అనుకుంటున్నాను.ఎందుకంటే నాకు ఒక్క థియేటర్ ఇస్తే వంద సార్లు చెప్పుకుంటాను. థియేటర్ ఇవ్వకపోతే రెండు వందల సార్లు చెప్తాను. అది నా నైజం. ఈ పండక్కి వస్తున్న చిరంజీవి, వెంకటేష్ గారి మన శంకర వర ప్రసాద్ గారు తో పాటు మిగిలిన సినిమాలు కూడా బాగా ఆడాలి. ప్రతి సంక్రాంతికి కోళ్లపై పందెం వేస్తారు . ఈ సారి పందెం డైనోసార్ పై వెయ్యండి అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ మాటలు ప్రభాస్ అభిమానుల్లో జోష్ ని తెప్పిస్తున్నాయి.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *