కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఆశీస్సులతో 18 వ వార్డు కాంగ్రెస్ పార్టీ బీ ఫారం అందుకున్న గుగ్గులోతు అరుణ శంకర్ నాయక్

singhamkrishna
1 Min Read

సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి,చౌటుప్పల్,ఫిబ్రవరి04,(గరుడ న్యూస్):

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశీస్సుల తో 18 వ,వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పార్టీ బి ఫారం ను అందుకున్నారు గుగ్గులోతు అరుణ శంకర్ నాయక్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తనపై నమ్మకంతో పార్టీ బీఫామ్ అందించినందుకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.అదేవిధంగా 18వ వార్డులో తాను నిర్వహిస్తున్న వివిధ సేవా కార్యక్రమాలు ప్రజల ఆశీస్సులతో 11 వ వార్డు కౌన్సిలర్ గా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.వార్డులో సమస్యలను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఆయన ఆధ్వర్యంలో వార్డును మరింత అభివృద్ధి చేస్తానని,మీ ఇంటి ఆడపడుచు గా మీ ముందుకు వస్తున్నాను నన్ను ఆశీర్వదించి గెలిపించాలని ఈ సందర్భంగా వారు ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,తదితరులుపాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *