మద్యం సేవించి వాహనాలు నడిపిన 8 మందికి ఒక్కొక్కరికి రూ.10,000 జరిమానా

Sivaprasad Patro
Sivaprasad Patro - Staff reporter
1 Min Read

పార్వతీపురం పట్టణం మరియు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 08 మందిని గురువారం పార్వతీపురంలోని అడిషనల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరచగా, ఎ.జె.ఎఫ్.సి.ఎం. న్యాయమూర్తి సౌమ్య జోసెఫ్  ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున మొత్తం రూ.80,000 జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి, ఐపీఎస్ తెలిపారు.మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలకు గురవ్వడమే కాకుండా ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పుగా మారుతుందని ఆయన తెలిపారు. ఈ తరహా వాహనదారులను కట్టడి చేయడం, రోడ్డు ప్రమాదాలను నియంత్రించడం లక్ష్యంగా ప్రతిరోజూ విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా ప్రత్యేక డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. జిల్లాలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తప్పవని వాహనదారులకు హెచ్చరిక జారీ చేశారు.అలాగే, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ పట్టుబడిన వారిపై పార్వతీపురం అడిషనల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ద్వారా మొత్తం రూ.2,400 జరిమానా విధించబడినట్లు పట్టణ సీఐ  వెంకట రావు తెలిపారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *